
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారిపై కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కాళేశ్వరాలయం దర్శనం అనంతరం భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు.. భూపాలపల్లి నుంచి కాటారం వైపు వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రులను పరకాల చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.