
రిపబ్లిక్ డే సందర్భంగా భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఐదుగురు పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని సెంట్రల్ కశ్మీర్ రేంజ్ డీఐజీ వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, వాకీ టాకీలు, ఆయుధాలు, డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్, నైట్రిక్ యాసిడ్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఐజాజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, షఫీల్ ఫరూక్ గోజ్రీ, నసీర్ అహ్మద్ మిర్‌లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవలే వీరు హజ్రత్బాల్ ప్రాంతంలో గ్రైనేడ్ దాడికి పాల్పడ్డారు.