బ్యాంకులకు లక్షా 60 వేల కోట్లు ఎగ్గొట్టిన వారి లిస్ట్

బ్యాంకులకు లక్షా 60 వేల కోట్లు ఎగ్గొట్టిన వారి లిస్ట్

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారి లిస్ట్ ను రిలీజ్ చేసింది ఆర్బీఐ. ఇంగ్లీష్ న్యూస్ సంస్థ ది వైర్ ఆర్టీఐ కింద మే 2019 న అప్లై చేసుకోగా ఎట్టకేలకు 30 మంది  రుణ ఎగవేతదారుల జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 30, 2019 వరకు రుణాల గడువు పూర్తయిన వారి జాబితాను  ఆర్బీఐ రిలీజ్ చేసింది . ఇందులో అత్యధికంగా రుణాలు ఎగ్గొట్టిన మొహల్ చోక్సీకి చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు తీసుకున్న రుణాలు మొత్తం రూ.50 వేల కోట్లకు పైగా ఉన్నాయి. డిసెంబర్ 2018 నాటికి  11000 కంపెనీలు 1.61 లక్షల కోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ డేటా తెలిపింది. రూ. 5 కోట్లకు పైగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారిని  పరిగణలోకి తీసుకుంది.