సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకంగా… పట్టు పరికిణీలతో ఆడపిల్లలు సందడి చేయంగా.. ముత్యాల ముగ్గులతో ఇంటి లోగిళ్లు నిండంగా.. భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకోగా.. ముచ్చటగా మూడురోజు పండుగ సంక్రాంతి. అయితే పండితులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని నియమాలను పాటించాలంటున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
ఆధ్యాత్మికవేత్తలు ... పండితులు తెలిపిన వివరాల ప్రకారం మకరసంక్రాంతి ( జనవరి 15) పండుగ రోజు సూర్యభగవానుడిని పూజించాలి. ఆరోజున సూర్యోదయానికి ముందే.. స్నానం చేసి.. నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. సంక్రాంతి అంటే.. హరిదాసులు.. గంగిరెద్దుల సందడి అంతా ఇంతా కాదు. హరిదాసులను విష్ణుమూర్తిగా భావించి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి.
గంగిరెద్దును నందీశ్వరుడిగా భావించాలి.. వాటిని కూడా పూజించాలి. పేదలకు వస్త్రదానం చేయాలి. బ్రాహ్మణులకు స్వయం పాకంతో పాటు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన సూర్య భగవానుడి ఆశీస్సులు పుష్కలంగా లభించి.. ఆనందం.. శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
మకర సంక్రాంతి (2026 మకర సంక్రాంతి) నాడు స్నానం చేయడం, దానం చేయడం మరియు పూజ చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సంవత్సరం, మకర సంక్రాంతి బుధవారం, జనవరి 15న వస్తుంది. మకర సంక్రాంతి కూడా కర్మలకు ముగింపును సూచిస్తుంది, వివాహాలు వంటి శుభ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి.
పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ రోజు ( జనవరి 15) ఉదయాన్నే పవిత్ర నదిలో స్నానం చేయాలి. అలా అవకాశం లేకపోతే ఇంట్లో గంగా నది జలాన్ని మూడు చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన పాపాలు తొలగుతాయని నమ్ముతుంటారు.
జాతక రీత్యా శని దోషం ఉన్నవారు ప్రత్యేక నియమాలను జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని దోషం లేకపోయినా ఈ నియమాన్ని పాటిస్తే శని భగవానుడు మంచిని కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత నల్ల నువ్వులను ప్రవహించే నీటిలో కలపండి . ఇలా చేయడం వలన శని భగవానుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు.
ఇంకా ఏమేమి చేయాలంటే...
- సూర్యభగవానుడిని పూజించి .. సూర్యనమస్కారాలు చేయాలి. ఆ తరువాత నీటిని రెండు చేతులలో పోసుకొని సూర్యునికి చూపిస్తే ఒక ప్లేట్ లో వదలాలి. ఆ తరువాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి.. ఇలా చేయడం వలన సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్టలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
- ఎర్రటిపువ్వులు .. బియ్యం గింజలు .. నీటిలో కలిపి ఓం సూర్యాయనమ: అనే మంత్రాన్ని 108 పఠిస్తూ పైన తెలిపిన విధంగానే సూర్యునికి ఎదురుగా ఉండి ఒక ప్లేట్ ఆ నీటిని వదలాలి. ఇలా చేయడం వలన సంపద వృద్దికలుగుతుందని పండితులు చెబుతున్నారు.
- శనిభగవానుడిని పూజించి.. బెల్లం.. నువ్వులు సమర్పించండి.. పేదలకు దానం చేయండి.
- మకరసంక్రాంతి రోజున పేదలకు బట్టలు.. దుప్పట్లు దానం చేయండి.. అలాగే ఆహారం పెట్టండి.
- బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోండి.
- గోమాతను పూజించి.. గోమాతకు ఆహారం ఇవ్వండి
