తాండూరు సభను సక్సెస్ ​చేయండి : గడ్డం ప్రసాద్​కుమార్

తాండూరు సభను సక్సెస్ ​చేయండి : గడ్డం ప్రసాద్​కుమార్
  •     స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్

తాండూరు, వెలుగు :  తాండూరులోని విజయ మూన్ స్కూల్ గ్రౌండ్​లో శుక్రవారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభను సక్సెస్​చేయాలని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్​రెడ్డితో కలిసి శుక్రవారం సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు.

చేవెళ్ల ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు. తాండూరు సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్​చార్జ్​దీపదాస్, ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ,7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొంటారని వెల్లడించారు. సభకు దాదాపు లక్ష మంది తరలిరానున్నారని చెప్పారు.

రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్​తాండూర్ ఇన్​చార్జ్ మహేశ్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్  సభ్యులు రమేశ్​మహారాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ సునీత సంపత్  పాల్గొన్నారు.