రామ్ డబుల్ ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ .. సెకండ్ సాంగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్

రామ్ డబుల్ ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ .. సెకండ్ సాంగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్

రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌’.  గతంలో వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ఇది సీక్వెల్.  ఇటీవల ‘స్టెప్పా మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే మాస్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా సెకండ్ సాంగ్ అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు. ‘మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత’ అంటూ సాగే ఈ పాటను జులై 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

 ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామ్ లుక్ ఆకట్టుకుంది.  మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సంజయ్ దత్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తుండగా  రామ్‌‌‌‌‌‌‌‌కు జంటగా కావ్య థాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటిస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.  ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.