అనుష్కకు బర్త్‌‌డే ట్రీట్

అనుష్కకు బర్త్‌‌డే ట్రీట్

పద్దెనిమిది ఏళ్ల సినీ ప్రయాణంలో అటు గ్లామర్ రోల్స్‌‌తో పాటు ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది అనుష్క శెట్టి. స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా కొనసాగుతూనే.. అరుంధతి,  రుద్రమదేవి, భాగమతి వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. రీసెంట్‌‌గా నవీన్ పొలిశెట్టితో  కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో కనిపించిన అనుష్క.. తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

మంగళవారం ఆమె బర్త్‌‌డే సందర్భంగా అనుష్క కొత్త మూవీకి సంబంధించిన అనౌన్స్‌‌మెంట్‌‌తో ట్రీట్ ఇచ్చారు మేకర్స్.  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌లో అనుష్క ‘భాగమతి 2’ చిత్రంలో నటించబోతోందని ప్రకటించారు. ఇది అనుష్క నటిస్తోన్న 50వ సినిమా. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామన్నారు.  ఐదేళ్ల క్రితం సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌గా వచ్చిన ‘భాగమతి’ మంచి విజయాన్ని అందుకోవడంతో పార్ట్‌‌2పైనా అంచనాలు ఏర్పడ్డాయి.