V6 News

రూమర్స్ నమ్మొద్దు.. అనిల్ రావిపూడి, వెంకీ సినిమా సంక్రాంతికే..

రూమర్స్ నమ్మొద్దు.. అనిల్ రావిపూడి, వెంకీ సినిమా సంక్రాంతికే..

వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సహ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. 

అయితే ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ విషయంలో  ఓ న్యూస్ వైరల్ అవుతుండగా దీనిపై క్లారిటీ ఇచ్చింది టీమ్. అసలు విషయానికొస్తే.. వెంకటేష్​  ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌లో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో నటిస్తుండగా ఇది సంక్రాంతికి రిలీజ్ కానుందని, దీంతో అనిల్ రావిపూడి మూవీ వచ్చే సమ్మర్‌‌‌‌‌‌‌‌కు వాయిదా పడనుందని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి.

ఇలాంటి బేస్‌‌‌‌లెస్ రూమర్స్ ఎవరూ నమ్మొద్దని.. తమ చిత్రం 2027 సంక్రాంతికి రావడం పక్కా అని మరోసారి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు.  ఎఫ్‌‌‌‌2, ఎఫ్‌‌‌‌3,   సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు లాంటి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌ తర్వాత  వెంకటేష్‌‌‌‌తో కలిసి అనిల్ రావిపూడి  చేస్తున్న ఐదవ చిత్రమిది.   అలాగే ‘పటాస్‌‌‌‌’తో తనకు దర్శకుడిగా ఫస్ట్ చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌‌‌‌తో రూపొందిస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.