
సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘ ఔట్‌పుట్ బాగా వచ్చింది.
సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండు పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరి అంచనాలకు మించేలా సుధీర్ సరికొత్త కోణంలో కనిపిస్తారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ.. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది’ అని చెప్పారు. మోహిత్ రెహమాని క్ సంగీతం అందిస్తున్నాడు.