సుడిగాలి సుధీర్ .. గోట్ మూవీ నుంచి ఇంట్రడక్షన్‌‌ సాంగ్‌‌ రిలీజ్

సుడిగాలి సుధీర్ .. గోట్ మూవీ నుంచి ఇంట్రడక్షన్‌‌ సాంగ్‌‌  రిలీజ్

సుడిగాలి సుధీర్ హీరోగా ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గోట్’.  గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్‌‌ అనేది ట్యాగ్‌‌లైన్. దివ్య భారతి హీరోయిన్‌‌. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఒక పాట విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో ఇంట్రడక్షన్‌‌ సాంగ్‌‌ను  రిలీజ్ చేశారు మేకర్స్. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌‌ క్యాచీ లిరిక్స్ రాశారు. 

పుష్ప’ టైటిల్ ట్రాక్ పాడి  పాపులరైన దీపక్‌‌ బ్లూ ఈ పాటను పాడటం హైలైట్‌‌గా నిలిచింది.  ‘బాసే హే నీలా ఉండే లక్కు మాకే లేదురా.. సెలెబ్రిటీ నీకన్నా ఎవడురా’ అంటూ హీరో క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేస్తూ సాగిన పాటలో సుధీర్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ  సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఎనభై శాతం షూటింగ్‌‌ పూర్తయింది. టాకీ పార్ట్‌‌ దాదాపు పూర్తిచేసుకున్నాం. యాక్షన్‌‌ ఎపిసోడ్స్‌‌, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌‌  ఉంది. త్వరలో వాటిని కూడా పూర్తిచేస్తాం’ అని చెప్పారు.