రిలీజ్కు సిద్దమైన సినిమా నుండి హీరోయిన్ సీన్స్ తీసేశారా?

రిలీజ్కు సిద్దమైన సినిమా నుండి హీరోయిన్ సీన్స్ తీసేశారా?

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ధ్రువ నక్షత్రం(Dhruva Natchathiram). అప్పుడెప్పుడో 2017లో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు. గౌతమ్ మీనన్(Goutham menon) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..  2018లో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వస్తోంది. విక్రమ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలానే వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. దాదాపు ఐదేళ్ల తరువాత రిలీజ్ కు సిద్దమైన ఈ సినిమా నుండి హీరోయిన్ సీన్స్ ను తొలగించారట. ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకరు రీతూ వర్మ(Rithu varma) కాగా మరొకరు ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). తాజాగా ఈ మూవీ రిలీజైన మై నేమ్ ఈజ్ జాన్ అనే పాటలో ఐశ్వర్య రాజేష్ పేరు కనిపించలేదు. దీంతో ఈ సినిమా నుండి ఆమెను తీసేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య రాజేష్ ఫ్యాన్స్ మేకర్స్ పై మండిపడుతున్నారు. రిలీజ్ కు సిద్దమైన సినిమా నుండి తనను ఎలా తీసేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.