చాక్లెట్‌లతో పెళ్లి కూతురు ముస్తాబు

చాక్లెట్‌లతో  పెళ్లి కూతురు ముస్తాబు

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్​ కావడంతో పెళ్లి కూతుర్లు విభిన్న రకాల గెటప్​లతో ఆకర్షణీయంగా  తయారవుతున్నారు. ఇక పెళ్లి కూతురు జడలకు కూడా ఎంతో స్పెషాలిటీ ఉంటుంది. రకరకాల పూల జడలను వేసుకుంటూ ఉంటారు. మార్కెట్ లోకి ఏ కొత్త వెరైట్ స్టైల్ వచ్చినా ఇప్పుడు యూత్ అస్సలు వదలడం లేదు. అయితే అందరికంటే కాస్త విభిన్నంగా ఆలోచించిన ఓ బ్యూటీషియన్..  పెళ్లి కూతురు జడను చాక్లెట్లు, టోఫీలతో తయారు చేసింది. చిత్ర అనే ఓ మేకప్​ ఆర్టిస్ట్​ చాక్లెట్ జడతో ఉన్న పెళ్లి కూతురు ఫొటోలు, వీడియోలు షేర్​ చేసింది. ఈ వీడియోలో కిట్ క్యాట్, ఫైవ్ స్టార్, మిల్కీ బార్, ఫెర్రెరో రోచర్ లాంటి బ్రాండెడ్ చాక్లెట్లతో ఆమె జుట్టును అందంగా అలంకరించారు.  కేవలం జడ మాత్రమే కాదు పాపిడి బిల్ల, నెక్లెస్ లను కూడా చాక్లెట్లతో తయారు చేసి డెకరేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో నెటిజన్లు కూడా కాస్త భిన్నంగానే కామెంట్లు పెడుతున్నారు. ‘పెళ్లి కూతురు జడ బాగుంది కానీ.. పిల్లలు ఆ జడను చూస్తే వదిలిపెడతారా?’ అంటూ రిప్లై ఇస్తున్నారు.