మేకప్ తీసేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

మేకప్ తీసేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

పెళ్లిళ్లు, పండుగల సీజన్​ ఇది. నలుగురిలో కొత్తగా కనిపించేందుకు కొందరు హెవీ మేకప్​  వేసుకుంటారు. అయితే మేకప్​ తీసేటప్పుడు  కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేమిటంటే... 
మేకప్​ తొలగించేటప్పుడు ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. 
మేకప్  తీసేయడం తొందరగా అవుతుందని వైపర్స్​ వాడుతుంటారు. అయితే వైపర్స్​తో మొత్తం మేకప్ పోదు. 
క్లెన్సర్​తో ముందుగా మేకప్​ని తీసెయ్యాలి. అందుకోసం ఆయిల్​ బేస్డ్​ క్లెన్సర్​తో ముఖం మీద 10–15 సెకన్లు మసాజ్​ చేయాలి. ఇలాచేస్తే లిప్​స్టిక్​ కూడా పోతుంది.
మేకప్​ తీసేసిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. వెచ్చని టవల్​ని ఫేస్​ మీద కొంచెం సేపు ఉంచుకుంటే చర్మరంధ్రాలు తెరచుకుంటాయి. మేకప్​ తీసేశాక తర్వాత పెదాలకి లిప్​బామ్​, ముఖానికి మాయిశ్చరైజర్​ రాసుకుంటే బెటర్.