V6 News

ప్రశాంతంగా మున్సిపల్ వార్డు ఎన్నిక

ప్రశాంతంగా మున్సిపల్ వార్డు ఎన్నిక
  •  89. 06 శాతం పోలింగ్​
  • పోలింగ్​ కేంద్రాలను విజిట్​ చేసిన అడిషనల్​ కలెక్టర్, ఎస్పీ

మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా మక్తల్​ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రం వద్ద బారులుదీరారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలు, వృద్దులు, యువకులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకే 76.60 శాతం పోలింగ్​ నమోదైంది. సాయంత్రం వరకు 89.06 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్​ కేంద్రాలను అడిషనల్​ కలెక్టర్​ ఫణీంద్రారెడ్డి, ఎస్పీ వినీత్​ సందర్శించా పోలింగ్​ సరళిని పరిశీలించారు.

గతంలో 6వ వార్డు ఎన్నికకు ఒక రోజు ముందు బీజేపీ అభ్యర్థి అత్మహత్య చేసుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక అనంతరం బ్యాలెట్​ బాక్సులను స్ట్రాంగ్ రూమ్​కు తరలించారు. సోమవారం కౌంటింగ్​ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్  అధికారి రాజేందర్​ గౌడ్​ తెలిపారు.