ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీలో 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీలో 12  మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలో 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఇంగ్లిష్ పేపర్ ఎగ్జామ్ జరిగింది. ఉదయం ఫస్టియర్ స్టూడెంట్లకు జరిగిన పరీక్షలో 66,300 మందికి గాను 60,799 మంది అటెండ్ అయ్యారు. వీరిలో 9 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మధ్యాహ్నం సెకండియర్ స్టూడెంట్లకు జరిగిన పరీక్షకు18,094 మందికి గాను 16,019 మంది అటెండ్ అయ్యారు. సెకండియర్ లో నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.