
- అయ్యాల సంతోష్
బాన్సువాడ రూరల్, వెలుగు: ఈ నెల 27న నిర్వహించే మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో మాల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో తొలిసారిగా ఈనెల 27 తేదీన బాన్సువాడ పట్టణంలో మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని చెప్పారు.
ముఖ్య అతిథిగా కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి రానున్నారని చెప్పారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాలలు అధిక సంఖ్యలో హాజరై మాలల ఐక్యతను చాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంతోష్ పిలుపునిచ్చారు.
మాల సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు మిర్జాపూర్ సాయన్న, మాలసంఘం సీనియర్ నాయకులు మల్లూరు సాయిలు,రాష్ట్ర కార్యదర్శి గౌడి నర్సింలు, కోటగిరి మాల సంఘం అధ్యక్షుడు దండు భూమేశ్, నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు బాల సాయిలు, జుక్కల్ ఇన్‌చార్జి, జాతీయ మాలల ఐక్య వేదిక అధ్యక్షుడు గైని ప్రవీణ్ కుమార్, పుప్పాల సైదయ్య, పాల గంగారాం, భైరపూర్ బేగరి గంగారాం, గున్న సాయిలు, బేగరి రాములు తదితరులు పాల్గొన్నారు.