మాల విద్యార్థులకు బాసటగా ఎంఈడబ్ల్యూఎస్ : విజయ భాస్కర్

మాల విద్యార్థులకు బాసటగా ఎంఈడబ్ల్యూఎస్ : విజయ భాస్కర్
  • మాల విద్యుత్ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు విజయ భాస్కర్  

పాల్వంచ, వెలుగు : రాష్ట్రంలోని నిరుపేద మాల విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు అవుతుందని మాల విద్యుత్ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయ భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం స్థానిక కేటీపీఎస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ కందుల గోవిందు నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ సొసైటీ నిరుపేద మాల విద్యార్థులకు బాసటగా నిలుస్తుందన్నారు. 

ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటుపై చర్చించేందుకు ఈనెల 26న హైదరాబాద్ లోని ముచ్చింతల్ ఎస్వీ రెడ్డి గార్డెన్స్ లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య​అతిథులుగా మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మె ల్సీలు అద్దంకి దయాకర్, గోరేటి వెంకన్న, భక్తి వెంకటయ్య హాజరుకానున్నట్లు తెలిపారు.

 తెలంగాణలోని మాల సోదరులందరూ సమావేశానికి హాజరుకావాలని కోరారు. సమావేశంలో నాయ కులు ఎన్.రాంబాబు, వి.సంపత్, ఎస్.రామచంద్ర, భూపతి సునీల్ పాల్గొన్నారు.