ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకట స్వామిపై దాడి తగదు : మాల మహానాడు అధ్యక్షుడు మద్దిలేటి

ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకట స్వామిపై దాడి తగదు : మాల మహానాడు  అధ్యక్షుడు మద్దిలేటి
  •     మాల మహానాడు వనపర్తి జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి

వనపర్తి టౌన్, వెలుగు : రాజకీయంగా ఎదుర్కోలేక పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ నాయకులు దాడులకు దిగడం తగదని మాల మహానాడు వనపర్తి జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి అన్నారు.  బుధవారం వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాలమహానాడు నాయకులు  నిరసన తెలిపారు.  మద్దిలేటి మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి కానీ, దాడులకు పాల్పడడం  పద్ధతి కాదన్నారు.  రాజిరెడ్డి అనే వ్యక్తిని  ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ దాడిని చేయించడం దారుణమైన చర్య అన్నారు. 

ఎంపీ, మంత్రిపై దాడులకు పాల్పడిన బాల్క సుమన్ , రాజిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. మాల మహానాడు వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బిజ్జ సహదేవ్, మండల ఉపాధ్యక్షుడు బక్కం రమేశ్, బెజ్జ వెంకటేశ్, జిల్లా కోశాధికారి నాగరాజు, నాయకులు పెరుమాల దేవరాజ్, చిన్న దాసు, పెద్దదాసు, వెంకటస్వామి పాల్గొన్నారు.