
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలో త్వరలో జరిగే వన మహోత్సవానికి రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ ను మాలమహానాడు సంఘం నాయకులు హైదరాబాద్ లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించాలని కోరారు. అత్యున్నత న్యాయస్థానంలోఎస్సీ వర్గీకరణను రద్దు చేసే వరకు ఉద్యమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
సింహ గర్జనను సక్సెస్ చేసినందుకు మంత్రి వివేక్ కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో సంఘం సీనియర్ నాయకుడు గుంతేటి వీరభద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు తలమల హుస్సేన్, ఉపాధ్యక్షుడు కొరివి దయానంద్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు వెంకటేశ్వర్లు, విద్యార్థి సంఘం నాయకులు సాలే నితీశ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.