
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు నాయకులు తెలంగాణ సెక్రటేరియట్ లో కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాద పూర్వకంగా కలిసి బోకేతో సత్కరించారు. ఆర్మూర్ లో ఆగస్టు రెండో వారంలో నిర్వహిస్తున్న మాలల ఆత్మీయ సమ్మేళనానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు.
మంత్రి స్పందించి ఆర్మూర్ కు వస్తానని హామీ ఇచ్చారు. ఆర్మూర్ యోగేశ్వర్ కాలనీలోని అంబేద్కర్ అభ్యుదయ మాల సంఘం నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేందుకు మున్సిపల్ వారు ప్రయత్నిస్తున్నారని మంత్రికి వివరించగా, మంత్రి వెంటనే కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శెట్టిపల్లి నారాయణ, మాల మహానాడు ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మూగ ప్రభాకర్, ట్రెజరర్ పులి గంగాధర్, కన్వీనర్ చిటుమల నగేశ్ ఉన్నారు.