పీవీరావు ఆశయాలను కొనసాగిస్తం : పబ్బతి శ్రీకృష్ణ

పీవీరావు ఆశయాలను కొనసాగిస్తం : పబ్బతి శ్రీకృష్ణ
  • రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ

బషీర్​బాగ్, వెలుగు: మాల మహానాడు వ్యవస్థాపకుడు పి.వి.రావు ఆశయాలను కొనసాగిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ చెప్పారు. ఐక్యతతో ముందుకు సాగి రాజ్యాధికారం సాధించడమే పి.వి.రావు అంతిమ లక్ష్యమని గుర్తుచేశారు. శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో పి.వి.రావు జయంతి నిర్వహించారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాల కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి పి.వి.రావు అని కొనియాడారు. అయితే రాజకీయ పార్టీలు బహుజనులను ఓటు బ్యాంకు ఉపయోగించుకుంటున్నారే తప్ప.. వారి సంక్షేమం కోసం కృషి చేయడం లేదని విమర్శించారు.