వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలి : మాల ప్రజా సంఘాల నాయకులు

వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలి : మాల ప్రజా సంఘాల నాయకులు

ఖమ్మం టౌన్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని అంబేద్కర్ యూవజన సంఘం రాష్ట్ర లీడర్లు, మాల ప్రజా సంఘాల నాయకులు కోరారు. బుధవారం ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో యూవజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దమళ్ల సత్యం, మాలమహానాడు అధికార ప్రతినిధి గొట్టే ముక్కల శ్రీను మాట్లాడారు.

Also Read : జగిత్యాలలో 18 మంది ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐల బదిలీ

కాకా వెంకటస్వామి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించాలని కోరారు. వివేక్ కు మంత్రి పదవి ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం, టీఎస్ఎస్ఏ నాయకులు పాల్గొన్నారు.