ఎస్సీ రిజర్వేషన్ల లో రోస్టర్ పాయింట్ల విధానాన్ని రద్దు చేయాలి : మాల సంఘం నాయకులు

ఎస్సీ రిజర్వేషన్ల లో రోస్టర్ పాయింట్ల విధానాన్ని రద్దు చేయాలి : మాల సంఘం నాయకులు

కోటగిరి, వెలుగు : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాన్సువాడ  డివిజన్, కోటగిరి మండల మాల సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ లో  రోస్టర్ పాయింట్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మాల సంఘం డివిజన్ అధ్యక్షుడు మీర్జాపూర్ సాయన్న మాట్లాడుతూ 2025  ఏప్రిల్ 14 న ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో నంబర్ 99 ద్వారా ఎస్సీలలో  3  గ్రూపులుగా విభజించి మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు.

 రోస్టర్ పాయింట్ లో 22ను కేటాయించి మాల సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగ రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.  కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శులు బ్యాగరి రాములు, పుప్పల సైదయ్య, మోరే జీవన్, కోటగిరి మండలాధ్యక్షుడు దండు భూమేష్,  ఉపాధ్యక్షుడు పాల గంగారం తదితరులు  పాల్గొన్నారు.