
బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor), హీరోయిన్ మలైకా అరోరా(Malaika Arora) లవర్స్ అని అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏజ్లో చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ, వీరి రిలేషన్ కొనసాగుతూ వచ్చింది.
ఇక లేటెస్ట్గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్అయిపొయింది. దాదాపు ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్నఈ బాలీవుడ్ జంట..ఎన్నోఈవెంట్స్కి అటెండ్ అవుతూ కెమెరాలకు ఫోజులిచ్చారు. దీంతో బాలీవుడ్లో వీరి మధ్య రిలేషన్ ఏంటనేది అందరికీ తెలిసింది. త్వరలో వీరు మ్యారేజ్ చేసుకుంటున్నట్టు..ఇంతలోనే బ్రేకప్ చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అందుకు కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి..అదేంటంటే, లేటెస్ట్గా మలైకా అరోరా సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ ఫ్యామిలీని అన్‌ఫాలో చేసింది.
మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్లో అర్జున్ కపూర్ సిస్టర్స్ అయినా..జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లను అన్‌ఫాలో చేసింది. అంతేకాదు అన్షులా కపూర్, బోనీ కపూర్ లను కూడా ఆమె అన్ ఫాలో అయింది. అలాగే రీసెంట్గా మలైకా అరోరా..ముంబైలోని ఓ ఐ క్లినిక్ని విజిట్ చేయడానికి వెళ్ళింది. అక్కడ తాను వేసుకున్నస్వేట్ షర్ట్ పై Lets Fall Apart అని రాసి ఉంది. అంటే తెలుగులో విడిపోదాం..అని అర్థం. ఇక మలైకా టీ షర్ట్ పై విడిపోదాం అని ఉండడంతో.. అర్జున్ కపూర్తో బ్రేకప్ అయినట్లు సోషల్ మీడియాలో బలంగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మలైకా అరోరా సింగిల్ గానే పార్టీలో కనిపిస్తుండటం కూడా బ్రేకప్ విషయంలో బలమైన టాక్.
ఇక రీసెంట్గా బాలీవుడ్ యాక్టర్స్ కుషా కపిలాతో అర్జున్ కపూర్ డేటింగ్లో ఉన్నట్లు గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇక మలైకా అరోరా..అర్జున్ కపూర్ కలవకపోవొచ్చు అని బాలీవుడ్ మీడియాలో అందరు అనుకుంటున్నారు.
అలాగే మలైకా గతంలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌ను మ్యారేజ్ చేసుకుంది. ఈ దంపతులకు అర్హాన్ అనే 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని విభేదాల కారణంగా 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.