సెప్టెంబర్ 29న ఫ్రీగా గుండె పరీక్షలు.. మలక్ పేట కేర్ ఆస్పత్రిలో నిర్వహణ

సెప్టెంబర్ 29న   ఫ్రీగా గుండె పరీక్షలు..  మలక్ పేట కేర్ ఆస్పత్రిలో నిర్వహణ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత గుండె ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈసీజీ, 2డి ఎకో, టీఎంటీ పరీక్షలతో పాటు కార్డియాలజిస్ట్‌ కన్సల్టేషన్ కూడా ఉచితంగా లభిస్తుందన్నారు. యాంజియోగ్రామ్ అవసరమని డాక్టర్ సూచించిన వారికి తగ్గింపు ధరలో ఆ పరీక్ష అందుబాటులో ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హెల్త్​ క్యాంపు నిర్వహించనున్నారు.