మార్చి 13న మాలల సింహ గర్జన

మార్చి 13న మాలల  సింహ గర్జన

హైదరాబాద్ లో నిర్వహించే ‘మాలల సింహ గర్జన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య. నిజామాబాద్ లో మాల-ఉప కులాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల మాదిగలను.. ఓటు బ్యాంక్ రాజకీయల కోసం చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలకు 2023 ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మార్చి 13న నిర్వహించే సింహ గర్జనలో పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు చెన్నయ్య.