
ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో మాలల సింహగర్జన నిర్వహిస్తామన్నారు మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. రాజకీయ అవసరాల కోసం కొన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణను తెర మీదికి తీసుకవచ్చాయన్నారు చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మద్దతు ఇస్తున్న పార్టీల విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.