నటుడు సూరజ్ కు రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కాలు

నటుడు సూరజ్ కు రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కాలు

కన్నడ నటుడు సూరజ్‌ కుమార్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూరజ్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. జూన్ 24 శనివారం మైసూర్‌-గుడ్లుపేట్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న సూరజ్‌ కుమార్‌ బైక్‌.. వేగంగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సూరజ్‌ కుమార్‌ ను స్థానికులు వెంటనే  ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో సూరజ్‌ కుమార్‌ కాలు నుజ్జునుజ్జు అవడంతో వైద్యులు ఆయన కుడికాలును తొలగించారని సమాచారం.

ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. "సూరజ్‌ బైక్‌పై మైసూర్‌ నుంచి ఊటీకి బయలు దేరాడు. రోడ్ పై వేగంగా వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ని ఢీ కొట్టాడని, సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో సూరజ్ కాలుకు తీవ్ర గాయమైందని తెలిపారు.