రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువనటుడు

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువనటుడు

రోడ్డు ప్రమాదంలో మలయాళ సినీ నటుడు బేసిల్ జార్జ్ చనిపోయాడు. జార్జ్ అతని ముగ్గురు స్నేహితులు, డ్రైవర్తో కలిసి కార్‌లో కొలెంచెర్రీ నుండి ఎర్నాకులం జిల్లా మువత్తపుజా వైపు వెళ్తుండగా కార్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న షాప్, ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికి  తరలిస్తుండగా జార్జ్, అతని స్నేహితులు నిధిన్, అశ్విన్ మరణించారు.

మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు బేసిల్ జార్జ్. సంఘటనా స్థలంలో ఉన్న వలస కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.