ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌తోపాటు, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.
‘ప్రియ సఖి’ అంటూ సాగే పాటను మంగళవారం ఉదయం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆనంద్, వైష్ణవి సముద్ర తీరంలో నడుస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ‘ప్రేమ చిన్న చిన్న క్షణాలలోనే ఎప్పుడూ మరింత అందంగా కనిపిస్తుంది’ అని పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
