ఇట్లు అర్జున మూవీ నుండి సాంగ్ రిలీజ్..

ఇట్లు అర్జున మూవీ నుండి సాంగ్ రిలీజ్..

డైరెక్టర్  వెంకీ కుడుముల  తన నిర్మాణ  సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం  ‘ఇట్లు అర్జున’.   అనీశ్​ హీరోగా,  మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  అనస్వర రాజన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. మే 28న ఈ చిత్రం  నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు  ప్రకటించారు. ‘హాయ్ రే’ అంటూ సాగే పాటను తమన్ ఎనర్జిటిక్‌‌‌‌గా కంపోజ్ చేశారని ఈ పాట అందరికీ నచ్చేలా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్  ఆకట్టుకుంటోంది. అనీశ్​, అనస్వర రాజన్‌‌‌‌ల మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిటికీ పక్కన తన ఆలోచనల్లో మునిగిపోయిన అనస్వరను, బయట కూర్చొని మౌనంగా ప్రేమతో చూస్తున్న అనీష్ లుక్ ఎంతో అందంగా కనిపిస్తోంది.