
దసరా, దేవర లాంటి చిత్రాల్లో విలన్గా నటించి తె లుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. ప్రస్తుతం వరుస సినిమా లతో బిజీగా ఉంటోన్న తనను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వాడుతున్నాడనే ఆరోపణలపై శనివారం విచారణకు హాజరైన ఆయన్ని నాలుగు గంటల విచారణ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఓ హోటల్లో షైన్ డ్రగ్స్ వినియోగిస్తు న్నాడని సమాచారం రావడంతో ఇటీవల పోలీసులు వెళ్లి సోదాలు చేశారు.
కానీ ఆ సమయంలో షైన్ టామ్ చాకో హోటల్ గది నుంచి దూకి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ వి జువల్స్ పోలీసులకు అందడంతో తనకు నోటీసులు జారీ చేశారు. దీంతో శనివారం ఉదయం తన లాయర్ తో స్టేషన్కు హాజరయ్యాడు. విచారణలో తనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మలయాళ నటి విన్సీ అలోషియ స్.. ఓ సినిమా సెట్ లో తనతో టామ్ చాకో అసభ్యంగా ప్రవర్తించాడని అక్కడి ఫిల్మ్ చాంబర్ కు ఫిర్యాదు చేసింది.