
మలయాళ సినిమాలను చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది.మలయాళం మూవీస్ పై ఇంట్రస్ట్ పెరగడానికి కారణం..వారి సహజమైన కాన్సెప్ట్. ఇక ఆ సినిమా విజయం ఆ కాన్సెప్ట్ను ఎంచుకోవడంలోనే ఉంటుంది.
డ్రగ్స్,మాఫియా,టెర్రిరిజం,సైబర్ క్రైమ్స్ అంటూ అదీ ఇదీ కాదు..సొసైటీకి ఉపయోగపడేవి,ప్రేక్షకులు తమను తాము రిలేట్ చేసి చూసుకునే కథలు ఎంచుకుంటారు.అందుకే మలయాళ సినిమా హద్దులు చెరిపేస్తూ..మనది అనే ఫీల్ ను ఇస్తోంది.ఓటీటీలు వచ్చాక మరింత దగ్గరైందనే చెప్పుకోవాలి.
తాజా విషయానికి వస్తే..మలయాళ స్టార్ హీరో బిజుమీనన్,విలక్షణ నటుడు ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన లేటెస్ట్ మలయాళం మూవీ తలవన్(Thalavan). క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మే 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ రూ.25 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా బిజు మీనన్,ఆసిఫ్ అలీ తమ యాక్టింగ్‌తో పాటు కథ,ట్విస్ట్ బాగున్నాయంటూ తలవన్ మూవీపై ఆడియెన్స్ ప్రశంసలు కురిపించారు.ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా మలయాళ స్టార్ డైరెక్టర్ జిస్ జాయ్ ఈ సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారు.క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి.అయితే,బిజు మీనన్ పోలీస్ పాత్రలో నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వడం విశేషం.బిజుమీనన్ తెలుగులో గోపిచంద్ నటించిన రణం మూవీతో పాటు రవితేజ ఖతర్నాక్ సినిమాలో విలన్ రోల్ చేశాడు.
A riveting crime investigation drama, starring Biju Menon and Asif Ali. Stream Thalavan from September 10th on Sony LIV .#Thalavan #ThalavanOnSonyLIV #SonyLIV #Thalavan #Thalavanmovie #Jisjoy #Bijumenon #Asifali #Arunnarayanproductions #Londonstudios #Thinkmusic #Pharsfilms pic.twitter.com/FAufbbd1qW
— Sony LIV (@SonyLIV) August 27, 2024
తలవన్ కథ:
ఎస్ఐ కార్తిక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫర్‌పై సీఐ జయశంకర్ (బిజు మేనన్) పనిచేస్తోన్న పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. కార్తిక్ దూకుడు మనస్తత్వం జయశంకర్‌కు ఈ మాత్రం నచ్చదు. ఓ కేసులో అరెస్ట్ అయిన మనుదాస్ అనే స్నేహితుడిని జయశంకర్ అనుమతి లేకుండా కార్తిక్ జైలు నుంచి రిలీజ్ చేస్తాడు. ఆ విషయంలో కార్తిక్‌తో జయశంకర్ తరుచూ గొడవ పడతాడు. జయశంకర్‌పై రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురుచూస్తుంటాడు కార్తిక్.
ఈ గొడవ జరిగిన కొన్నాళ్ల తర్వాత జయశంకర్ ఇంటి టెర్రస్ పై రమ్య అనే యువతి డెడ్‌బాడీ దొరుకుతుంది. రమ్యతో జయశంకర్‌కు ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా ఉండటంతో ఈ హత్య అతడే చేశాడని పోలీసులు అనుమానిస్తారు. అతడిని అరెస్ట్ చేస్తారు. అసలు రమ్యను ఎవరు హత్య చేశారు? ఈ నేరంలో జయశంకర్ ఎలా చిక్కుకున్నాడు? అసలు ఈ మర్డర్ అతనే చేశాడా? ఇక ఈ మర్డర్ కేసును ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను కార్తిక్ చేపట్టడానికి కారణం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.