
బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) రాబోతుంది.'అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ అన్ లిమిటెడ్..లిమిటే లేదు' అంటూ వచ్చేస్తోంది. అంటే ఈసారి లిమిటే లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్ కు హామీ ఇచ్చేశాడు. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి షురూ అని స్టార్ మా ఛానెల్,డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాయి.
లేటెస్ట్గా బిగ్ బాస్ సీజన్ 8 టెలీకాస్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలతో అప్డేట్ వచ్చింది. "సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు స్టార్ మాలో బిగ్‌బాస్ 8 తెలుగు ప్రసారం కానుంది. శనివారం, ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకు టెలీకాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24/7 స్ట్రీమింగ్ కానుంది. ‘ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌కి లిమిటే లేదు’ అని పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Your Sunday plans with Nagarjuna ??#BiggBossTelugu8 Streaming 1st September from 7pm! pic.twitter.com/M5bvoF4Wca
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 27, 2024
ప్రస్తుతం సీజన్ 8 నుంచి హోస్ట్‌గా ‘కింగ్’ నాగార్జున తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే,అందులో ఏ మాత్రం నిజం లేదని తాజాగా విడుదలైన పోస్టర్‌తో స్పష్టమైంది. అంతేకాదు..ఈసారి తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లూ తెలుస్తోంది. గత సీజన్ కంటే ఈసారి అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే ఈ కొత్త సీజన్లో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విభజించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
Also Read :- ఓటీటీకి వచ్చేస్తున్న లాల్ సలామ్
బిగ్ బాస్..ఈ వినూత్న షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఒక హౌస్ లో ఉంచి..వారికి ప్రపంచంతో సంబంధాన్ని కట్ చేసి, టాస్కుల పేరుతో వాళ్ళల్లో వాళ్లకె గొడవలు పెట్టిస్తూ ముందుకు సాగడం ఈ షో స్పెషాలిటీ. ఇప్పటికే ఏడు సీజన్‌లు దుమ్ముదులిపేశాయ్. ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ అప్డేట్ రావడంతో ఆడియన్స్ ఖుషి అవుతున్నారు.