మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం.. ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ప్రకటించిన కేంద్రం

మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం.. ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ప్రకటించిన కేంద్రం

మలయాళ సినీ నటుడు మోహన్‌లాల్‌కు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ నెల 23న మోహన్‌లాల్‌కు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఇప్పటికే మోహన్‌లాల్‌ను పద్మశ్రీ, పద్మభూషన్‌ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. మలయాళం సహా 5 భాషల సినిమాల్లో మోహన్‌లాల్‌ నటించి మెప్పించారు.

సెప్టెంబర్ 23, 2025న జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మోహన్ లాల్కు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ ప్రదానం చేస్తారు. భారతీయ సినీ పరిశ్రమకు మోహన్ లాల్ చేసిన సేవలు, ఆయన సినీ ప్రస్థానం ఆదర్శనీయం అని.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రకటించినట్లు భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది. 

మోహన్ లాల్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వృషభ’. హిస్టారిక‌‌ల్ యాక్షన్ డ్రామాగా తెర‌‌కెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌‌మెంట్ నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. నంద కిషోర్ దర్శకత్వంలో కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌‌తో క‌‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని   నిర్మిస్తోంది. ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలైంది. ‘యుద్ధాలు, భావోద్వేగాలు, గ‌‌ర్జన’.. ఈ సినిమా కథ ఇదే.

మైథాల‌‌జీతో పాటు యాక్షన్‌‌, డ్రామా,  స‌‌స్పెన్స్ ఇలా అన్నిక‌‌మ‌‌ర్షియ‌‌ల్ ఎలిమెంట్స్‌‌తో  తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్ లాల్ నట విశ్వరూపాన్ని చూస్తారని మేకర్స్ చెప్పారు. తెలుగు, మలయాళం  భాష‌‌ల్లో ఏక‌‌కాలంలో ఈ సినిమా చిత్రీక‌‌ర‌‌ణ జ‌‌రిగింది.  హిందీ, క‌‌న్నడ భాష‌‌ల్లోనూ సినిమా రిలీజ్ కానుంది.