కౌలాలంపూర్: ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో గతేడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఇండియా షట్లర్లు మంగళవారం మొదలయ్యే మలేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీతో కొత్త సీజన్‌ను మెరుగ్గా ప్రారంభించాలని చూస్తున్నారు. గాయాలు, ఇతర కారణాలతో గత సీజన్‌లో ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన పీవీ సింధు రెండు నెలలు ఆటకు గ్యాప్ తీసుకొని ఈ టోర్నీతో రీఎంట్రీ ఇస్తోంది. తొలి మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ షువో యున్‌ను ఎదుర్కోనుంది.
గత సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన లక్ష్యసేన్ తొలి రౌండ్‌లో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జాసన్‌తో తలపడనున్నాడు. మెన్స్ డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్– - చిరాగ్ షెట్టి జోడీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. డిసెంబర్‌లో వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ సెమీస్ చేసిన ఈ జంట ఈసారి టైటిల్ పై గురి పెట్టింది. యంగ్‌స్టర్స్ ఆయుష్ శెట్టి, ఉన్నతి హూడా, మాళవిక బన్సోద్ కూడా పోటీలో ఉన్నారు.
