మరోసారి నిరాశ పరిచిన కిడాంబి శ్రీకాంత్‌

మరోసారి నిరాశ పరిచిన కిడాంబి శ్రీకాంత్‌
  • క్వార్టర్‌ ‌లో ఓడిన శ్రీకాంత్
  • మలేసియాలో ముగిసిన పోరు

కౌలాలంపూర్‌ : మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ లో ఇండియా పోరు ముగిసింది.  టైటిల్‌ రేసులో మిగిలిన కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌  ఫైనల్లోనే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 18–21, 19–21తో నాలుగో సీడ్‌ చైనా ప్లేయర్‌ చెన్‌లాంగ్ చేతిలో వరుస గేమ్‌ల్లో ఓడిపోయాడు. గత వారం ఇండియా ఓపెన్‌ లో రన్నరప్‌ గా నిలిచి ఆత్మవిశ్వాసం పోగుచేసుకున్న తెలుగు షట్లర్‌ మరోసారి నిరాశ పరిచాడు. ఈ సీజన్‌ లో అతను నాలుగు టోర్నీల్లో క్వార్టర్‌  ఫైనల్స్‌ లోనే ఓడిపోవడం గమనార్హం. చెన్‌లాంగ్‌‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ ల్లో ఐదింటిలో పరాజయం పాలై న శ్రీకాంత్‌ఈ సారి కూడా అదే ఫలితాన్ని రిపీట్‌ చేశాడు. చివరగా 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ లో ఆడిన మ్యాచ్‌ లో కిడాంబిని ఓడించిన చెన్‌ .. పటిష్ట డిఫెన్స్‌ , అద్భుతమైన షాట్లతో ఇండియా షట్లర్‌ పై మరోసారి  పై చేయి సాధించాడు. కాళ్ల మధ్య నుంచి రిటర్న్‌‌ ‌షాట్లు కొడుతూ ఫ్యాన్స్‌ ను విశేషంగా అలరించాడు.అయితే, స్టార్టింగ్‌‌లో అతనిపై  శ్రీకాంత్‌ పై చేయిసాధించాడు.

తొలి గేమ్‌ లో బ్రేక్‌‌ టైమ్‌ కు 11–7తో స్పష్టమైన ఆధిక్యం లో నిలిచాడు. అదే జోరును కొనసాగిస్తూ లీడ్‌ ను 16–11కు పెంచు కున్నా డు. కానీ, నెమ్మదిగా పుంజుకున్న చైనీస్‌ ప్లేయర్‌ 17–17 తో శ్రీకాంత్‌ ను అందుకున్నాడు. ఆపై, లెఫ్ట్‌‌ సైడ్‌ లో మంచి క్రాస్‌ కోర్ట్‌‌ రిటర్న్‌‌ కొట్టి గేమ్‌ గెలిచాడు. రెండో గేమ్‌ మొదట్లోనూ ప్రత్యర్థికి కిడాంబి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే, జోరు పెంచిన చెన్‌ లాంగ్‌‌ పదునైన స్మాష్‌ తో 11–7తో బ్రేక్‌‌కు వెళ్లాడు. ఈ దశలో కిడాంబి అనవసర తప్పి-దాలు చేశాడు. లైన్‌ ను తప్పుగా అంచనా వేయడంతో పాటు వైడ్లు ఆడాడు. అతని షాట్ల  టైమింగ్‌‌ కూడా సరిగ్గా లేకపోవడంతో చెన్‌ చూస్తుండగానే ఆధిక్యాన్ని 16–8కి పెంచుకున్నా డు. ఈ దశలో చైనా ప్లేయర్‌ కూడా కొన్ని వైడ్‌ షాట్లు ఆడగా శ్రీకాంత్‌ పుంజుకున్నాడు. వరుసగా పాయింట్లు గెలిచి 18–18తో స్కోరు  సమం చేసి ఆశలు రేపా డు. కానీ, బ్యాక్‌‌లైన్‌ పై విన్నర్‌ కొట్టిన చెన్‌ మ్యాచ్‌ పాయింట్‌ పైకి వచ్చాడు. అతను కొట్టిన మరో షాట్‌ ను రిటర్న్‌‌ చేసేందుకు శ్రీకాంత్‌ డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది.