మాల్దీవ్ పార్లమెంట్ ఎలక్షన్‌లో భారత్‌కు షాక్!

మాల్దీవ్ పార్లమెంట్ ఎలక్షన్‌లో భారత్‌కు షాక్!

మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెసే మరోసారి విజయం దక్కించుకుంది. ఇది భారత్ కు షాకింగ్ న్యూసే. మొత్తం 93 స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటికే 63 స్థానాల్లో గెలిచి మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. ముయిజ్జు పార్టీ భారత్ కు వ్యతిరేకంగా.. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు.  భారత్ వ్యతిరేక చర్యలతో మాల్దీవుల పార్లమెంట్‌లో ముయిజ్జు వైఖరిని చాలామంది వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి రేగింది. కానీ అనూహ్యంగా మరోసారి ముయిజ్జు పార్టీనే భారీ విజయం కైవసం చేసుకుంది. 

గత కొద్దికాలంగా మాల్దీవులతో ఇండియా సంబంధాలు దెబ్బతిన్నాయి, పర్యాటకం విషయంలో ఇండియాతో నెలకొన్న వివాదానికి తోడు ఆ దేశం తీసుకుంటున్న చైనా అనుకూల నిర్ణయాలు ఇండియాకు ఆగ్రహం తెప్పించాయి. మాల్దీవుల్లోని భారత సైన్యాన్ని వెనక్కి పంపించారు.  మాల్దీవుల పార్లమెంట్‌లో మొత్తం 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీ , కొన్ని ఇతర పార్టీలు పోటీ చేశాయి. ఇప్పటి వరకూ 86 స్థానాల ఫలితాలు ప్రకటించగా అందులో 63 స్థానాల్లో ముయిజ్జు పార్టీ విజయం సాధించింది. చైనా అనుకూల నిర్ణయాలకే మాల్దీవ్ ప్రజలు అధికారం కట్టబెట్టారు.