రెడ్డీలు ఐక్యంగా ముందుకు సాగాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

రెడ్డీలు ఐక్యంగా ముందుకు సాగాలి :  ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  • మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  

అల్వాల్, వెలుగు: రెడ్డీలు ఐక్యంగా ముందుకు సాగాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఆదివారం అల్వాల్ సర్కిల్‌‌లోని తోట పెంటారెడ్డి గార్డెన్‌‌లో నిర్వహించిన రెడ్డి కుల సంఘం సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రెడ్డీలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ, అభివృద్ధి దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. 

మచ్చ బొల్లారంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కుల సంఘం సభ్యులు గుమ్మడి ఆనంద్ రెడ్డి, కౌకుంట్ల శ్రీధర్ రెడ్డి, తోట దేస్వంత్ రెడ్డి, తోట రాజేందర్ రెడ్డి, సాదా ఇంద్రసేనారెడ్డి, సామల సత్తిరెడ్డి, బొబ్బిలి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.