ఘనంగా మల్లన్న కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

ఘనంగా మల్లన్న కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

సిద్ధిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్న కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. తోట బావి దగ్గర నిర్మించిన కళ్యాణ వేదికపై స్వామివారి కళ్యాణం నిర్వహించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యులు వైదిక పర్యవేక్షణలో మల్లన్నస్వామి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి మంత్రి హరీశ్ రావు, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. స్వామివారికి మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణానికి ముందు ఉదయం దేవాలయ అర్థమండపంలో దృష్టికుంభం నిర్వహించారు. స్వామివారికి ఛత్ర కన్ను అమర్చిన తర్వాత నిజరూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామివారి కళ్యాణానికి భారీసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక గ్యాలరీల్లో కూర్చుని భక్తులు కళ్యాణం కన్నులారా చూశారు. కరోనా టైం కావడంతో.. ఆలయ అధికారులు భక్తులకు 25వేల మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. సాయంత్రం శకటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.

For More News..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రోజుకు 2 జీబీ డాటా ఫ్రీ

బర్డ్‌ఫ్లూ బారిన మరో రాష్ట్రం.. మొత్తం ఏడు రాష్ట్రాలలో వ్యాప్తి

గుళ్లోకి లాక్కెళ్లి మహిళపై అత్యాచారం.. 5 గంటల తర్వాత వదిలేసిన కామాంధులు