ఈ మధ్య నేను తుమ్మినా దగ్గినా.. ఫుల్ వైరల్ అవుతున్న: మల్లారెడ్డి

ఈ మధ్య  నేను తుమ్మినా దగ్గినా.. ఫుల్ వైరల్ అవుతున్న: మల్లారెడ్డి

ఈ మధ్య తాను తుమ్మినా.. దగ్గినా ఫుల్ వైరల్ అవుతున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లారెడ్డి యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితో పాటు మల్లారెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు.  మహిళలకు విషెస్ చెప్పిన మల్లారెడ్డి కాసేపు  కాలేజీ విద్యార్థులను తన మాటలతో అలరించారు.

 ఈ మధ్య తాను సెలబ్రిటీ అయ్యానని.. తాను తుమ్మితే తుఫాన్ వస్తుంది... తుమ్మినా, దగ్గినా వైరల్ అవుతున్నానని మల్లారెడ్డి అన్నారు. మల్లన్న అంటే క్రేజ్ ఉట్టిగనే రాలేదని.. అందుకోసం చాలా కష్టపడ్డానని చెప్పారు. పూలమ్మిన, పాలమ్మిన అని చెప్పి మళ్లీ విద్యార్థులను నవ్వించారు.  ప్రపంచంలో అనేక అవకాశాలు మహిళల కోసం ఉన్నాయని ధైర్యంగా ముందుకు అడుగేసి  చేజిక్కుంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ మహిళల గౌరవాన్ని ఉన్నతిని  కాపాడేందుకు అనేక పథకాలు తెచ్చారని చెప్పారు.