- ఏఐసీసీని కలిసి అందజేసిన సంగీతం శ్రీనివాస్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ప్రజాపాలనను ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఢిల్లీ రాం లీలా మైదానంలో పార్టీ నిర్వహించిన ‘ఓట్ చోర్ – గద్దీ ఛోడ్’ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత నేతలు సోమవారం ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇందులో భాగంగారాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్.. ఖర్గేకు చేనేత అల్లికతో తయారు చేసిన చిత్రపటా(ఖర్గే)న్ని అందించారు. ఈ భేటీలో భాగంగా... శ్రీనివాస్ తో పాటు నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
