గత ప్రభుత్వంలో మంత్రులు బొమ్మల్లాగా ఉండేవాళ్లు: మాజీ ఎంపీ మల్లు రవి

గత ప్రభుత్వంలో మంత్రులు బొమ్మల్లాగా ఉండేవాళ్లు: మాజీ ఎంపీ మల్లు రవి

హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, కవిత తెలంగాణ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని వివర్శించారు మాజీ ఎంపీ మల్లు రవి.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది.. నిరుద్యోగ భృతి ఇస్తాన్నరు ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మంత్రులు బొమ్మల్లాగా ఉండేవాళ్ళని ఎద్దేవా చేశారు. జనవరి 13వ తేదీ శనివారం సోమాజిగూడలో పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని...రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో మల్లు రవి పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వేస్తే సీపీఎస్ నుండి యూపీఎస్ చేస్తామని చెప్పామని.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పాద యాత్రలు చేసినప్పుడు అనేకసార్లు సీపీఎస్  పై మాట్లాడారని తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయ ప్రాముఖ్యత ఎంతో ఉంటుంని.. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద మహిళలకూ ఉచిత బస్ సౌకర్యం... ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల పథకం వంటి రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. మిగిలిన హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని అన్నారు.

గతంలో బిఆర్ఎస్ పార్టీ 86 హామీలను ఇచ్చి అమలు చేయలేదని... అలాంటి పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ ని 420 పార్టీ అనడం తగదని అన్నారు. ఉపాధ్యాయ అనుబంధ సంఘాలు కలిసి జేఏసీ ఏర్పడాలని.. సీపీఎస్, యూపీఎస్ అనే అంశంపై రవీంద్ర భారతిలో ఓ ప్రోగ్రాం పెట్టండని ఆయన సూచించారు.