మల్లు స్వరాజ్యం జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం

మల్లు స్వరాజ్యం జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం

హైదరాబాద్: మల్లు స్వరాజ్యం జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, రైతాంగ పోరాటానికి ఆమె కేంద్ర బిందువుగా నిలిచారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బసవ పున్నయ్య భవన్లో మల్లు స్వరాజ్యం భౌతికకాయంపై మంత్రి దయాకర్ రావు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మల్లు స్వరాజ్యం పీడిత ప్రజల పక్షపాతి అని అభివర్ణించారు. జీవితాంతం ప్రజల కోసం, ప్రజల మధ్యనే గడిపిన పేదల పక్షపాతి స్వరాజ్యం అని అన్నారు. తన మాట, పాటలతో ప్రజలను చైతన్య పరిచి ఎంతోమంది రైతులు, మహిళలు, యువకులను రైతాంగ సాయుధ పోరులో భాగస్వామ్యులను చేసిన ఘనత ఆమెకు దక్కుతుందన్నారు. మల్లు స్వరాజ్యానికి పాలకుర్తి ప్రాంతంతో వియదీయరాని బంధం ఉందన్నారు. చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీంరెడ్డి నరసింహారెడ్డి వంటి నేతలతో మల్లు స్వరాజ్యం కలిసి పని చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాజ్యం పాత్ర మరువలేనిదన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

వాకింగ్ ఎంత నడవాలి? ఎలా నడవాలి?

యుద్ధాన్ని ఆపకుంటే.. రష్యా కోలుకోవడానికి ఓ తరం పడతది