పాదయాత్ర కాకపోతే .. పొర్లు దండాల యాత్ర చేసుకో : మాలోత్​ కవిత 

పాదయాత్ర కాకపోతే .. పొర్లు దండాల యాత్ర చేసుకో : మాలోత్​ కవిత 

మహబూబాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్​ ఎంపీ మాలోత్​ కవిత సూచించారు. సీఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. షర్మిల పాదయాత్రల కాకపోతే మోకాళ్ల యాత్ర చేసుకోవాలని సూచించారు. కానీ సీఎం కేసీఆర్ ను తిడితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూసే బుద్ధిని షర్మిల మార్చుకోవాలని కవిత హితవు పలికారు. గాలిమాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించిన ఆమె.. షర్మిల పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తరిమికొడతారని అన్నారు.