గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన సీఎం

గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన సీఎం

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్​ఖర్​కు మధ్య గొడవ రచ్చకెక్కింది. తన ట్విట్టర్ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో గవర్నర్ ను బ్లాక్ చేసినట్టు మమత సోమవారం ఓ ప్రెస్​కాన్ఫరెన్స్​లో చెప్పారు. కొంతకాలంగా వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ‘పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యానికి ఒక గ్యాస్ చాంబర్​లా మారుతోంది’ అంటూ గవర్నర్ ఇటీవల చేసిన కామెంట్స్​కలకలం రేపాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ఆయన ట్విట్టర్ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.“నేను ముందుగా క్షమాపణలు చెబుతున్నా. ఆయన(గవర్నర్) ప్రతిరోజూ నన్ను లేదా మా ఆఫీసర్లను అబ్యూస్​చేస్తూ ఏదో ఒక ట్వీట్ చేస్తారు. రాజ్యాంగ విరుద్ధమైన, అనైతిక విషయాలు మాట్లాడతారు. సలహాలు ఇవ్వడానికి బదులు ఆర్డర్లు జారీ చేస్తుంటారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని బాండెడ్​లేబర్​గా చూస్తారు. అందుకే నాకు ఇరిటేషన్​వచ్చి ట్విట్టర్​అకౌంట్​బ్లాక్​చేశా” అని మమతా బెనర్జీ మీడియాతో అన్నారు. చాలాసార్లు సీఎస్​ను, పోలీసు చీఫ్‌‌‌‌‌‌‌‌ను గవర్నర్ బెదిరించారని అన్నారు. ధన్‌‌‌‌‌‌‌‌ఖర్‌‌‌‌‌‌‌‌ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి పలుమార్లు లేఖలు కూడా రాశామన్నారు. కాగా, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జగ్దీప్ ధన్​ఖర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మానవ హక్కులను కాలరాసే ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, రక్తపాతంతో నిండిన దుర్భర భూమిగా బెంగాల్‌‌‌‌‌‌‌‌ను చూడలేమని అన్నారు.