పశ్చిమ బెంగాల్ సీఎం మమత సవాల్

పశ్చిమ బెంగాల్ సీఎం మమత సవాల్

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: టీఎంసీకి మళ్లీ జాతీయ పార్టీ హోదా కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాకు తాను ఫోన్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బుధవారం ఆమె సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. జాతీయ హోదా రద్దు చేసినా తమ పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత వారం టీఎంసీ పార్టీ హోదాను ఎన్నికల సంఘం రద్దు చేసింది.

దీనిపై మంగళవారం జరిగిన ఓ ర్యాలీలో బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. టీఎంసీ జాతీయ పార్టీ హోదా రద్దయ్యాక మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని షాను ఆమె అభ్యర్థించినట్లు ఆరోపించారు. సువేందు అధికారి చేసిన ఈ ఆరోపణలను మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. టీఎంసీ జాతీయ పార్టీ హోదాపై అమిత్ షాకు తాను కాల్ చేసినట్లు నిరూపిస్తే సీఎం పదవికే రిజైన్ చేస్తానని సవాల్ చేశారు. కేంద్ర సంస్థ విషయంలో బీజేపీ తనపై కుట్ర పన్నుతోందని విమర్శించారు. 2024 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల మార్కును కూడా దాటదని మమత పేర్కొన్నారు.