
కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలంలో భారీ వర్షాలకు మూలవాగు ప్రవహిస్తుండడంతో మండలంలోని మామిడిపల్లి మూలవాగు పై ఉన్న కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రానికి వెళ్లేందుకు, రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
ఈ ప్రభుత్వమైనా తాత్కాలికంగా కాకుండా శాశ్వత నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వరలక్ష్మి మామిడిపల్లి మూలవాగు ప్రవాహాన్ని పరిశీలించారు.