యూపీలో బీజేపీని ఓడించండి

యూపీలో బీజేపీని ఓడించండి

లక్నో: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. లక్నోలో సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రచారం చేసిన ఆమె బీజేపీ తీరును కడిగిపారేశారు. సమాజ్వాదీ పార్టీ విజయం కోసం ప్రచారం చేసేందుకు యూపీ వచ్చానన్న దీదీ.. బీజేపీ తప్పుడు వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయదని, 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థుల్ని బరిలో దింపుతామని  మమత స్పష్టం చేశారు. మార్చి 3న తాను వారణాసికి రానున్నట్లు చెప్పారు. 

హతాస్, ఉన్నావ్ ఘటనలు, కరోనా సమయంలో గంగానదిలో శవాలు తేలేందుకు కారణమైన వారిని చరిత్ర ఎన్నటికీ క్షమించదని మమత అన్నారు. ఈ దారుణాలు జరుగుతున్నప్పడు సీఎం యోగి ఎక్కడున్నారని ప్రశ్నించారు. వీటన్నింటికీ బాధ్యతవహిస్తూ ఆయన యూపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని దీదీ డిమాండ్ చేశారు.