ఆదిలాబాద్ లో క్షుద్ర పూజల పేరుతో చిలిపి పనులు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

 ఆదిలాబాద్ లో క్షుద్ర పూజల పేరుతో చిలిపి పనులు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఆదిలాబాద్, వెలుగు: క్షుద్రపూజ పేరుతో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ వన్ టౌన్ పరిధిలో ఓ మహిళ అనారోగ్యంతో బాధ పడుతోంది. తాను నయం చేస్తానంటూ మహారాష్ట్రలోని సక్రాని గ్రామానికి చెందిన క్షుద్రపూజలు చేసే అభినయ్ కుమార్ ఆమెను నమ్మించాడు.

సదరు మహిళను గదిలో ఉంచి, కుటుంబసభ్యులను బయటకు పంపించాడు. తర్వాత అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబసభ్యులు అతన్ని బయటకు తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ సునీల్ కుమార్ విచారణ చేపట్టి, నిందితుడిని అరెస్ట్​చేశారు.